అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని చాటుచున్
ఆనందసంద్ర ఉప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని చాటుచున్
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ ..
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
2. యెరూషలేము - రాజనగరిలో - యేసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
యేసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
Super
ReplyDelete