Nuthana Geetham Song Lyrics
నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ) || 2 ||
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను || 2 ||
నూతన
2. కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ) || 2 ||
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ || 2 ||
నూతన
3. మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ) || 2 ||
నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ || 2 ||
నూతన
No comments:
Write CommentsSuggest your Song in the Comment.