నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని
1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను ||నీ పాద||
2. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను ||నీ పాద||
3. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము ||నీ పాద||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.