నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా ||నీ సన్నిధిలో||
1. మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా ||2||
నీ చిత్తము మాలో నెరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా ||2||
కృప చూపుము దేవా - దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా ||నీ సన్నిధిలో||
2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు ||2||
విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా ||2||
దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా ||నీ సన్నిధిలో||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.