రాజువైన నా దేవా ....
రారాజువైన యేసయ్య...   ||2||
కోటి స్వరముల స్తుతించిన   ||2||
తనివి తీరదు నా మనసున   ||2||
ఆరాధన స్తుతి ఆరాధన.... ||6||   ||రాజువైన||
1. కృప చూపుటలో శ్రీమంతుడా
 తరతరములకు ఆరాధ్యుడా     ||2||
 షాలేము రాజా నా యేసయ్య 
 స్తుతి ఘనత నా మహిమ నీకేనయ ||2||  ||ఆరాధన||
   
2. నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము ....  ||2||
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము ...  ||2|| ||ఆరాధన||
3. మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము  ||2||
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము   ||2|| ||ఆరాధన||
      


No comments:
Write CommentsSuggest your Song in the Comment.