ప్రేమకే ప్రతిరూపము - నీవే నా ప్రాణము (2 )
నీ ప్రేమే శాశ్వతం - నీ మాటే అమృతం (2 )
నా జీవితం నీకంకితం - నా ప్రియ యేసయ్య
1. నే నడిచే దారిలో - నా తోడువై 
నే పీల్చేగాలిలో - నా శ్వాసవై 
నీ చేతి నీడలో నన్ను కాచావే 
నీ గుండె లోతుల్లో నన్ను దాచావే 
2. నన్ను వీడని - నా కన్న తండ్రివి 
నన్ను మరువని - నా కన్న తల్లివి
నిన్ను మరచిన - నీ చేయి విడచినా 
నన్ను విడువని - యేసయ్య 
3. గురిలేని వేళలో - నా గమ్యమై 
దరిలేని దారిలో - నా దీపమై 
నా చింతలన్నియు - నీవే తీర్చావే 
నే కోరిన రేవుకు - నన్ను చేర్చావే 
4. నన్ను కోరుకున్న - నా పరమ తండ్రివి 
నన్ను విడువనన్న - నా మంచి కాపరి 
నీవే నా గురి - నాకున్న ఊపిరి
నీవే నా ప్రాణం యేసయ్య 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.