వెండి బంగారములు నాకు వలదు
పేరు ప్రఖ్యాతలు నాకు వలదు ||2||
ఇహభోగ భాగ్యాలు నాకు వలదు ||2||
సిరిసంపదల ఆశ నాకు లేదు ||2||
నీ పాద సన్నిధే నాకు చాలు ||2||
స్తుతి నీకే నా ప్రభూ ||2||
స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభూ ||2||
స్తుతి నీకే నా ప్రభూ ||2||
1. కమ్మని విందులు నాకు వలదు
క్షణిక ఆనందాలు నాకు వలదు ||2||
కీర్తీ కిరీటాలు నాకు వలదు ||2||
కలల సంచారాలు నాకు వలదు ||2||
నీ దివ్య కౌగిలే నాకు చాలు ||2|| ||స్తుతి నీకే||
2. బంధు బాందవ్యాల బాధ వలదు
బరువు భాధ్యతలన్న భయము వలదు ||2||
నీ మధుర బంధమే నాకు చాలు ||2||
నీవిచ్చు భాగ్యమే నాకు మేలు
నువు మెచ్చు కార్యమే నాకు చాలు
నువు హెచ్చు కార్యమే నాకు చాలు ||స్తుతి నీకే||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.