నీవు వంటరివా
నీవు వంటరివా- తోడు లేక ఉన్నవా-
నీవు బానిసవా- స్వేచ్ఛ లేక ఉన్నవా
తృణీకరించబడినవా -ప్రేమ లేక ఉన్నవా
ఓ దార్పు లేక ఉన్నవా -ఓడి పోయి ఉన్నవా
అయితే నేస్తమా-యేసుని చేరుమా
ఇప్పుడే ఇక్కడే -నీ హక్కును పొందుమా ||2||
|| నీవు ఒంటరివా ||
1.నీవు నమ్మిన నీవారే వంచించి వెళ్లగా
   ప్రేమించిన నీ హితులే నీ చేయి విడువగా ||2||
   నీ మార్గం అగమ్యమై దారే కానరాక
   నీ బంధం అబద్ధమై అర్ధం చూపలేక
   ప్రేమ కోసమే నీవు పరుగెడుచున్నవా... 
   శాంతి కోసమే నీవు వేదకుచుఉన్నవా..
     ( అయితే నేస్తమా ..)
               || నీవు వంటరివా ||
2.ఎండ మావిలో నీటి కోసమే పరుగెడుచున్నవా
   స్వప్నము లొనే లోకముందని బ్రమపడుచున్నవా ||2||
   కళ్ళనిండా కన్నీరై కాంతే కానరాక..
   నిరీక్షణ లేని నీ బ్రతుకే అంతం కోరగా...
   నీ పాపములకు నీవు దాసుడవైనావ..
   విడుదల కోసం నీవు వేచి ఉన్నవా ||2||
        (అయితే నేస్తమా...)
      || నీవు వంటరివా||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.