నా దేవుడే నాకూ
ప్రాణ స్నేహితుడు 
నా దేవుడే నాకూ ప్రాణ స్నేహితుడు
            నా దేవుడే నాకూ మార్గ దర్శకుడు
            నా దేవుడే నాకూ నిత్య పోషకుడు
            నా దేవుడే నాకూ జీవనదాయకుడు
గతి లేని నన్ను వెదకినా అతి కాంక్ష నీయుడాయనె
మితి లేని ప్రేమ చూపిన రవి కోటి తేజుడాయనే
                 || నా దేవుడే నాకూ ||
1.  శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను.. 
   నా నీడగా.. వెన్నంటి యున్న.. నా ప్రాణనాథుడు 
   మారణపు సంకెళ్లు నుండి.. నను విడిపించెను.. 
    నా బంధకాలని తెంచి వేసినా.. నా నీతి
   సూర్యుడు.. 
    క్షణమైనా మరువని వీడని నా క్షేమా శిఖరము..
 
    క్షమించి నాకూ అందించెను ఈ రక్షణానందము
    క్షమయైనా బ్రతికు మార్చి అక్షయత నొసగెను
                   || గతి లేని నన్ను||
2.  వాక్యమే నాజీవమై నన్ను బ్రతికించెను.. 
    నా పాదములకు చిరు దీపమైన నా దివ్య  తేజము
   ఆత్మ యే పరిపూర్ణమై నన్ను బలపరచెను
   నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము 
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గ దర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్లా కురిసేను 
               || గతి లేని నన్ను ||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.