తరగని నీ ప్రేమ
తరగని నీ ప్రేమ విరివిగ నాలో సిరులుకురిపించెనే
చెరగని నీ రూపు నిరతము నాలో సరిగమ పలికించెనే ||2||
ఆ|| ప || తంబుర సితార వాధ్యములతో స్వరమెత్తుకుని
తండ్రిదేవా మనసార నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును |2| |తరగని |
1. నిన్ను విడిచి నా హృదయం - వెనుకకు మరలునా
నన్ను పిలిచి ఉన్నత స్థలమున - పాదములు నిలుపగా |2|
ప్రేమించి జీవవాక్యముతో పోషించింతివి
రక్షించి శాంతిజలముల చెంత నడిపితివి |2| |తంబుర |
2. నిన్ను తలచిన ప్రతీ క్షణం-ఆటంకము ఆపునా
నన్ను నడిపిన ప్రతీ స్థలం - అద్బుతములు చేయగా |2|
దీవించి గొప్పచేయ మొదలు పెట్టితీవి
కరుణించి క్షేమాభివృద్దితో నింపితివి |2| |తంబుర |
3.నీతో గడిపిన మధురజ్ఞాపిక - నామదిలో మరుగాయేనా
నాతో పలికిన ప్రమాణము నెరవేరుచుండగా |2|
నియమించి నిండుగాదీవెన పంచితివి
ఆత్మనింపి క్రీస్తు నీయందే నను పెంచితివి |2| |తంబుర |
No comments:
Write CommentsSuggest your Song in the Comment.