ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా
ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నాదా(2)
ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా (2)
ప్రార్థనలో మాన్ఫలేని గాయమున్నదా(2)
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే బహుగొప్పది(2)
1. ఊపిరిని నిలిపింది- హాగరూ ప్రార్థనే
విజయమును తెచ్చింది - దెబోరా ప్రార్థనే(2)
రాజు హృదిని మార్చింది - ఎస్తేరు ప్రార్థనే(2)
గాయములను మాన్పింది- హన్న ప్రార్థనే(2)
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా గురి
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా సిరి (2)
||ప్రార్థన ||
2. బలహీనుని బలపరిచే - ఆమోసు ప్రార్థనే
అగాధం నుండి లేపింది - యోనా ప్రార్థనే(2)
ఉజ్జివం తెచ్చింది - హబక్కుకు ప్రార్థనే(2)
తండ్రి చిత్తం నెరవేర్చును యేసయ్య ప్రార్ధనే (2)
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా ఊపిరి....
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే బహుగొప్పది....(2) ||ప్రార్థన ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.