నీవే శ్రావ్య సదనము
నీవే శ్రావ్య సదనము - నీదే శాంతి వదనము
నీ దివిసంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా ॥ 2॥
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్య ॥2॥
1. విరజిమ్మే నాపై కృపకిరణం -
విరబూసె పరిమళమై కృపకమలం॥ 2॥
విశ్వాసయాత్రలో ఒంటరినై -
విజయశిఖరము చేరుటకు ॥2॥
నీదక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి ॥ 2 ॥
నను బలపరచి - నడిపించే నా యేసయ్యా
||నీవే||
2. నీనీతి నీరాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు
నలిగివిరిగిన హృదయముతో-
నీ వాక్యమును సన్మానించితిని ॥2॥
శ్రేయస్కరమైన దీవెనతో -
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు ॥ 2 ॥
నను ప్రేమించి - పిలచితివి - నా యేసయ్యా
||నీవే||
3. పరిశుద్ధాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా ॥2॥
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయ్య ॥2॥
నా పితరులకు ఆశ్రయమై
కోరినరేవుకు చేర్పించి ॥ 2 ॥
నీ వాగ్ధానం -నెరవేర్చితివి - నా యేసయ్యా
||నీవే||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.