విశ్వాసం
ఎన్నటికీ విశ్వాసాన్ని వదలివేయవద్దు
మీరు విశ్వసిస్తే అన్నీ సాధ్యమే
ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు
ఆశించే కార్యాలు అన్నీ జరుగును
చిరునవ్వులతో వస్తాడు
ఉత్తమమైనది ఇస్తాడు
1. యోబును ఎరిగిన నీవు
పలువిధ శ్రమలకు నడుమ
విసుగక దేవునియందు నిలిచియుంటే
యోబుకున్న ఆశీర్వాదం నీకు ఉన్నది
పోయినవి రెండింతలుగా పొందుకొందువు
ఇక సమృద్ధితో ఉందువు
2. సంతానభాగ్యం కోసం
నిరిక్షించు శారాలాగా
రేయింబగలు నీవు ఏడ్చుచుంటివా
అబ్రాహాము ఆశీర్వాదం నీకు ఉన్నది
ఎంత కాలమైనా గాని ఫలితమున్నది
నీ విశ్వాసం వమ్మైపోదు

