నీవే నాకాధారము
నీవే నాకాధారము - నీలోనే ఆనందింతున్ (2) ప్రార్ధించి బలమునొందే ప్రభువా నన్ను ఆదరించవే (2)
1.ఎదురించువారె లేచినను
రక్షణయె ఇక లేదన్నను (2)
కేడెము నీవే మహిమయు నీవే -
నా తల ఎత్తవు నీవెనయ్యా (2)
2. పూర్వములో జరిగినవి తలంచి
కలవరం చెందినను (2)
జరిగినవన్ని మేలుకోరకై
తండ్రి నీవే మార్చినావు (2)
3. నేడు చూస్తున్న ఐగుప్తీయులను
ఇక మీదెన్నడు చూడబోను(2)
ప్రభువే నాకై యుద్దం చేయును
వేచియుందును వోపికతో || (2)
నీవే నాకాధారము - నీలోనే ఆనందింతున్ (1)
పండుకొని మేలుకొందును - నిద్రింతు నెమ్మదితొ (1)


No comments:
Write CommentsSuggest your Song in the Comment.