భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||
1. విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యాగములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2) ||శరణు||
2. ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనయె మా జీవా ధారం
చేకొనవే మా స్తుతి ధూపం (2) ||శరణు||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.