యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా ||2||
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా ||2||
అ.ప. వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా ||2||
యేసయ్యా… యేసయ్యా… ||యేసయ్యా వందనాలయ్యా||
1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ||2||
నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా ||2||
యేసయ్యా… యేసయ్యా… ||యేసయ్యా వందనాలయ్యా||
2. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ||2||
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా ||2||
యేసయ్యా… యేసయ్యా…||యేసయ్యా వందనాలయ్యా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.