నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు   
నా దాగుచోటు నీవే యేసయ్య ||2||
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును 
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము 
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము ||నా  యేసునాధ||
1.  ప్రభు యేసు దైవమా  - చిరకాల స్నేహమా 
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే -  సీయోను మార్గమై 
భయపడను నేనిక  -  నీ ప్రేమ సాక్షిగా  
గానమై  - రాగమై
అనుదినము నిన్నే  -  ఆరాధింతును 
కలకాలం నీలో  -  ఆనందింతును ||నా  యేసునాధ||
2. కొనియాడి పాడనా  - మనసార వేడనా 
నీ ప్రేమ మాటలే -  విలువైనవీ
ఎనలేని బాటలో  - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ 
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం 
నీ పాద సేవయే - నాలోని ఆశగా 
ప్రాణమా - జీవమా 
అనుదినము నిన్నే  -  ఆరాధింతును
కలకాలం నీలో  -  ఆనందింతును ||నా  యేసునాధ||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.