రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని…
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని (2)
కన్నులార నిన్ను చూడాలని (2)
కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా||
1. యదార్థ హృదయముతో నడచుకొందును
ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా||
2. దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
నా పొరుగు వారిని దూషింపను (2)
అహంకారము గర్వము నంటనీయను
నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా||
3. నిర్దోష మార్గముల నడచుకొందును
మోసము నా ఇంట నిలువనీయను (2)
అబద్ధికులెవ్వరిని ఆదరింపను
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.