ఆశ్రయుడా
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా "2"
విశ్వవిజేతవు సత్య విధాతవు
నిత్యముమహిమకు ఆధారము నీవు "2"
లోకసాగరాన కృంగిన వేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి 
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా
నీకేనయ్యా స్తుతి ఆరాధనా "2"
//ఆశ్రయుడా నా యేసయ్య//
1. తెల్లని వెన్నెల కాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు "2"
కరుణనుచూపి కలుషముబాపి 
నను ప్రేమించిన ప్రేమవు నీవు "2"
జనులకు దైవం జగతికి దీపం 
నీవు గాక ఎవరున్నారు?
 నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజు "2"
//ఆశ్రయుడా నా యేసయ్య//
2. జీవిత దినములు అధికములగునని
వాగ్దానము చేసి దీవించితివి "2"
ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల
జాడలు చూపించితివి "2"
శ్రీమంతుడవై సిరికే రాజువై వెదలను
బాపి నా స్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా "2"
//ఆశ్రయుడా నా యేసయ్య//
3. నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదనునా స్తుతి అర్పణ  "2"
పరిశుద్ధులలో నీ స్వాస్త్యము యొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు "2"
ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్ధించెదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా 
నీ  చిత్తమే నాలో నెరవేర్చుమా
//ఆశ్రయుడా నా యేసయ్య//
HOSANNA MINISTRIES 
SONG SHEET 
DOWNLOAD


No comments:
Write CommentsSuggest your Song in the Comment.