పరిశుద్ధుడా
పరిశుద్ధుడా  పరిపూర్ణుడా 
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
నిర్మించావయ నియమించావయా
నడిపించావయ నిలబెట్టావయా
నా దేవా నీ సాక్షిగా 
నీ సేవకై పిలిచావు  ||పరిశుద్ధుడా||
1 ) నా రూపకల్పన జరుగకమునుపే 
గర్భములోనే నన్ను ఏర్పరిచావు ||2||
ఈ భువిలోనే నీ జనములకు 
నీ వక్తగా/ ప్రవక్తగా నను ప్రతిష్టించావు ||2||
నా యేసు ప్రభువా నీకే నా స్తోత్రముల్ 
ఆత్మరూపుడా నీకే ఆరాధన ||2|| ||పరిశుద్ధుడా||
2 ) నా జీవిత గమ్యం  -నీవే చూపించి
 
నేనుఎరుగని నీ జనులకు  -
ప్రతినిధిగా నడిపించి (ఏర్పరిచి )
అంచెలు అంచెలుగా నను హెచ్చించితివి
బ్రతికేదేను ప్రభు నీ కొరకే
నా యేసు ప్రభువా నీవే నా ఆధారము
నా రక్షక నీవే నా గమ్యము ||2|| ||పరిశుద్ధుడా||
3 ) నా ముదిమిలో కూడా నీవే నా కాపరి
      నే బ్రతుకు దినములేల్లా    
     
      నిన్నే  సేవింతును నా మట్టుకైతే  
బ్రతుకుట క్రీస్తే  చావతై మరి లాభమే ||2||
నా యేసుప్రభువా ఇదియే నాకానాందము
నా జీవితాంతము నిన్నే సేవింతును ||2|| ||పరిశుద్ధుడా||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.