సుకుమారుడా
జగములనేలే పరిపాలక -జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము  -
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
1. మహారాజుగా నా తోడువై  - నిలిచావు ప్రతి స్థలమున 
నా భారము నీవు మోయగా - సులువాయే నా పాయనము
నీ దయచేతమే కలిగిన క్షేమము - ఎన్నడు నన్ను వీడదే ||2||
నీ సన్నిధిలో పొందిన మేలు - తరగని సౌభాగ్య ||2||
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
2. సుకుమారుడా నీ చరితము - నేనెంత వివరింతును 
నీ మహిమ ప్రకటించగా - నేనెంతో ధన్యుడను 
ఘనులకు లేదే ఈ శుభతరుణం  - నాకిది నీ భాగ్యమా  ||2||
జీవితమంతా నీకర్పించి - నీ రుణము నే తీర్చనా  ||2||
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
3. పరిశుద్ధుడా సారాధివాయి నడిపించు సీయోనుకే 
నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే 
నా విశ్వాసము నీ పైనుంచి - విజయము నే చాటనా ||2|| 
నా ప్రతి క్షణము ఈ భావనతో - గురి యొద్దకే సాగెద ||2||
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
HOSANNA MINISTRIES 
SONG SHEET 
DOWNLOAD


No comments:
Write CommentsSuggest your Song in the Comment.