కనులతో కానలేను
కనులతో కానలేను ఆ ఘోరమరణం
           కండ్లను తెరువంగజేయ మనకై భలిదానం
           ఎంత గొప్పదో తన త్యాగము
           ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము
          //కనులతో కానాలేను//2//
          1)తన దేహం చీల్చుతున్న వారికోసమే 
             తెలియక చేసిరి తండ్రి క్షమించుమనెనే//2//
             ఎంత గొప్పదో తన ప్రార్ధన
             ఎంతెంత గొప్పదో ఆ క్షమా ప్రార్థన
               //  కనులతో కానలెను//
         2) తన పాపం ఒప్పుకున్న పాపి తోడనే
              పరదైసుకు వచ్చేదవని అభయమునే ఇచ్చేనే//2//
             ఎంత గొప్పదో తన రక్షణ
             ఎంతెంత గొప్పదో ఆ పాపి రక్షణ//2//
           //కనులతో కానాలెను//
        3) ఒంటరియైన కన్నతల్లి మరియను చూచి 
             శిష్యునికే  అప్పగించి భద్యతనే తిర్చనే//2//
             ఎంత గొప్పదో తన బాధ్యత
            ఎంతెంత గొప్పదో ఆ సుతుని బాధ్యత
          //కనులతో కానలేను //
        4) కన్న తండ్రి చేయి విడువనీ ఈ ప్రేమ పుత్రుడే 
            నన్నెందుకు చేయి విడిచితివని వేదనతో అరిచెనే//2//
            ఎంత గొప్పదో తన బంధము
            ఎంతెంత గొప్పదో ఆ ప్రేమ బంధము
           //కనులతో కామలేను//
        5) జీవజల  ధారలను పంచింన ఇతనే
             లేఖన నెరవేర్పుకై దప్పికగా ఉందననే//2//
             ఎంత గొప్పదో తన దాహం
             ఎంతెంత గొప్పదో తన ఆత్మ దాహం
                 //కనులతో కానలేను//
           6)జీవిత కాలమంతా సేవ చేయగా
              ప్రాణమిచ్చు తోడనే సమాప్తమైనదనెనే//2//
               ఎంత గొప్పదో తన సేవ
              ఎంతెంత గొప్పదో ఆ సంపూర్ణ సేవా
                      // కనులతో కానలేను//
          7) అప్పగించే మన దేహం మన కోసమే
               ఆత్మను తండ్రికి ఇచ్చి ప్రాణమునే విడిచేనే//2/)
               ఎంత గొప్పదో తన అర్పన
               ఎంతెంత గొప్పదో ఆ సమర్పణ
            // కనులతో కానలేను//


No comments:
Write CommentsSuggest your Song in the Comment.