దవళవర్ణుడా రత్నవర్ణుడా
దవళవర్ణుడా రత్నవర్ణుడా సృష్టాంతతిలోన సుందరుడా
రాజా రాజా రాజా నా యేసు రాజా
1. నీ ముఖము మనోహరమే నీ స్వరము మాధుర్యమే
సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే
రాజా రాజా రాజా నా యేసు రాజా
2. నా యెడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమై యున్నవి
సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే
రాజా రాజా రాజా నా యేసు రాజా

