దున్నని బీడు భూములలో
పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో -
ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో -
మారుమూల పల్లెలలో (2)
1. ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే -
ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే -
పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే -
భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని||
2. ఎదిగే క్రమములో పిలుపును మరిచే -
గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని
మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే -
ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే -
పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
3. ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను
నే కూల్చను నేనయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే
భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.