నీ కృప లేకుండా నేనేల
జీవించగలను
నీ కృప లేకుండా నేనేల జీవించగలను
నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను
ఊహించుటయే నా వల్ల కాదయ్యా -
ఆలోచించుంటే నా గుండె బరువాయగా //2//
నీ కృప ఉంటే చాలయ్య -
నీ దయలేక నేను లేనయ్యా //2//
1. నా దుఃఖ స్థితిలో ఓదార్చినది -
నా ఒంటరి పయనంలో తోడై నిలచినది //2//
నీ కృపయే నా పక్షమై నిలచి -
నాకై పోరాడి విజయమునిచ్చినది//2//
నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా
2. దారి తప్పిపోయినను దరి చేర్చినది -
ఏ పాపము నెంచక కౌగలించినది //2//
ఎట్టి అర్హత చూడలేదు -నాలో యోగ్యత కోరలేదు//2//
నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా
3. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి-
కృపయే మార్గమై నడిపించుచున్నది //2//
దీనుల యెడల కృప చూపు వాడవు-
మారని ప్రేమతో ప్రేమించు వాడవు //2//
నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.