ప్రార్థన ఆలకించువాడా
ప్రార్థన ఆలకించువాడా - నా యేసయ్యా….
ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు “2”
అనుపల్లవి: ప్రార్థించేదను మొరపెట్టేదను నీ సన్నిధిలో
ఫలమొందేదను బలముపొందేదను ప్రార్థనలో “2”
1. పరిస్థితులు ఏవైనా - ప్రార్ధనే మా ఆయుధం
ప్రాణమే పోతున్నా - ప్రార్థనే మా ఔషధం “2”
పరిమితులే లేని వాడవు యేసయ్యా
పరికించి ఒకసారి మా ప్రార్థన వినుమా “2”
ఆలాపన: ప్రార్థనే మా ఆయుధం - ప్రార్థనే మా ఔషధం
ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే మా విజయం
ప్రార్థించేదను మొరపెట్టేదను “2”
2. పరిపూర్ణ మనస్సుతో - నిన్నే నే ప్రార్థింతున్
పరిమళవాసనగా - నా ప్రార్ధనుండును గాక “2”
పశ్చాతాపముతో - నిన్ను ప్రార్థింతును
పరికించి ఒకసారి - నా ప్రార్థన వినుమా “2”
ఆలాపన: ప్రార్థనే మా ఆయుధం - ప్రార్థనే మా ఔషధం
ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే మా విజయం
ప్రార్థించేదను మొరపెట్టేదను “2”
No comments:
Write CommentsSuggest your Song in the Comment.