మానను మానను
యేసు నిన్ను నే స్తుతియించుట
మానను మానను మానను
కృతజ్ఞతలు నీకు చెల్లించుట
ఎన్నడూ మాననే మానను
ప్రతికూల పరిస్థితులు
వెంటాడు ఘడియలలో
నీ సిలువ తట్టు తిరిగి
నీ యాగమును తలచి
1. సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి
వరముగా నిత్యజీవము నిచ్చితివి
నాకింక నిన్ను స్తుతియించకుండా
ఉండు కారణమేది లేకపోయెను
2. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
నా పాప రోగము కడిగితివి
ఈనాడు నీవు నా దేహరోగము
స్వస్థపరచినా లేకున్నా
3. పరమందు ధనవంతుడు నే నగుటకు
దారిద్యములో నీవు జీవించితివి
ఈ లోక ధనము నను విడచి పోయి
దరిద్రునిగా నే మిగిలినను
4. అసాధ్యుడవు నీవు సర్వాధికారివి
సార్వభౌముడవు దయాలుడవు
నా జీవితములో నా మేలుకోరకే
సమస్తమును జరిగించు వాడవు
No comments:
Write CommentsSuggest your Song in the Comment.