ఓ క్రైస్తవ యువకా
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
జీవము నీదగురా ||ఓ క్రైస్తవ||
1. పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా (2)
పావన యేసుని పాదము చేరిన ||ఓ క్రైస్తవ||
2. మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా (2)
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ||
3. భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా (2)
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.