ప్రేమించు దేవుడు
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు యేసు దేవుడు
   పాటలు పాడి ఆనందించెదం 
ఆహా  ఎంతో ఆనందమే......(2)
1. తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు
    ప్రతి అవసరమును తీర్చు దేవుడు
    హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే  
||ప్రేమించు దేవుడు||
2. నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు
    తోడు నీడగ నన్ను కాపాడును
    హల్లెలూయ  ఆనందమే – సంతోషమే సమాధానమే   
||ప్రేమించు దేవుడు||
3. నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు
     సర్వ కాలమందు జయ మిచ్చును
     హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే 
||ప్రేమించు దేవుడు||
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు
     అంతము వరకు చేయి విడువడు
    హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే 
||ప్రేమించు దేవుడు||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.