సమానులెవరు ప్రభో 
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)
సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల     ||సమానులెవరో||
1. సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప    ||సమానులెవరో||
2. పరార్ధమై భవ – శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా     ||సమానులెవరో||
3. దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ   ||సమానులెవరో||
4. ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత   ||సమానులెవరో||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.